Saturday 7 June 2014

ఒక చిన్నారి సీత కథ


ఒకానొక ఊరిలొ కృష్ణా నది ఒడ్డున చిన్న పూలతోట ఉంది. ఆ పూలతోట మధ్యలో సీత అనే చిన్న పాప వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది. ఒకరోజు ఉదయం ఇంకా పూర్తిగా తెలవారకముందే ఆ పూలతోటలో ఆడుకోవాలని రివ్వుమంటూ ఎగురుకుంటూ వెళ్ళింది. ఇంట్లోనుండి బైటకు రాగానే పచ్చని తోట కొంచం తలెత్తి చూస్తే నీలాకాశం ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఆ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ రెట్టించిన ఉత్సాహంతో మరింత ఎగురుకుంటూ ముందుకు సాగింది. బంతిపూల చెట్లు కనపడ్డాయి. "ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రకృతి, భూమి మొత్తం పూలతో సువాసనతో నిండి ఉన్నదా అనిపించేలా ఉంది" అని మనసులో అనుకుంది. ఆ పూలతోటను దాటుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళింది. కొంతదూరం వెళ్ళాక కృష్ణానది తీరం కనపడింది ఆక్కడే కాసేపు కూర్చొని మబ్బుల మాటునుండి సింధూర వర్ణంలో ఉదయించే సూర్యుడిని చూస్తుంది. ఆ అందం చూస్తూ ఆనందంతో పొంగిపోయింది. అలా కొంతసేపు చూసాక వెనుక ఉన్న పూలతోటలోకి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళింది.
అలా స్నేహితులతో ఆ పూలతోటలో ఆడుకుంటూ ఉండగా ఎవరో తెలియదు ఒకామే వచ్చి సీతను గట్టిగా పట్టుకొని తాను నవ్వుకుంటూ ఎటూ వెళ్ళనివ్వకుండా తీసుకెళ్ళి సీతను ఒక గదిలో భందించింది. అస్సలు వెలుగే లేని ఆ గదిలో గాలి కూడా సరిగ్గా రాని ఆ గదిలో సీత ఒక్కతే ఉంది బిక్కు బిక్కు మంటూ... సీత బైటకు వెళ్ళే మార్గాలు కోసం ఎంతో ప్రయత్నించింది. కాని సాద్యం కాలేదు. సీత అమ్మకోసం ఎంతో ఏడ్చింది అమ్మా అంటూ గట్టిగా అరిచింది కాని ఏమి లాభం లేదు. సీత వాళ్ళ అమ్మ సీతకోసం వాళ్ళ ఇంట్లో ఎదురుచూస్తుంది. సీతకోసం పూలతోటలన్నీ కలయతిరుగుతూ వెతుకుతుంది.
సీత ఒక సీతాకోకచిలుక ప్రకృతిలో మనకి అందాన్ని, ఆనందాన్ని పంచుతూ విహరించే సీతాకోకచిలుక. కాని పాపం ఒకామే ఈ సీతాకోకచిలుకని గట్టిగా పట్టుకొని ఒక అగ్గిపెట్టెలో బంధించింది. ఈ బాధించే ప్రక్రియలో పాపం ఆ సీతాకోకచిలుక రెక్కలలో ఒకటి తెగిపోయింది. ఇంతలో సీతని అగ్గిపెట్టెలో బంధించిన ఆమే వచ్చి అగ్గిపెట్టెని తెరచింది. సీతని బైటకు తీసిచుస్తే ఒక రేక్కతో ఎగరలేక ఉన్న ఒక్క రెక్కతో ఒక వైపు బరువెక్కి నడవనూ లేక అలా పడిపోయింది. బంధించిన ఆమె కూడా "ఛి ఈ సీతాకోక చిలుక ఎగరట్లేదు" అని సీతను అక్కడే పడేసి వేరే సీతాకోక చిలుకని పట్టుకోవడానికి మళ్ళి పూలతోటకి వెళ్ళింది. ఇంతలో సీత అక్కడ పడిపోవడం సీత తల్లి చూసి అక్కడకు ఏడుస్తూ వచ్చి గుండెలు పెక్కడిల్లెలా ఏడ్చింది. రెక్క విరిగిన బాధతో సీత అలాగే ఏడుస్తూ చనిపోయింది. ఇలా తన బిడ్డను చూడలేక ఏడుస్తూ సీత తల్లి కూడా అక్కడే చనిపోయింది

మిత్రులారా మనం మన ఆనందానికి ఎన్ని సీతాకోకచిలుకలను పట్టుకొని బంధించి ఇలాగే బాధపెట్టి ఉంటాము కాని ప్రకృతిలో భాగమైన అవి మనకు రంగు రంగులతో అందాన్ని ఆనందాన్ని పంచుతున్నాయి కాని మనం మాత్రం వాటి ప్రాణం పోయేలా చేస్తున్నాం .. ప్రకృతిని ప్రేమిద్దాం మానవులగా జీవిద్దాం --- మీ బుజ్జిబాబు

ఈ మన Telugu mitrulam_01 page ని like చేసి ప్రోత్సహించగలరు...

No comments:

Post a Comment