Saturday 10 May 2014

శ్రీ రామకృష్ణ పరమహంస

శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది.

భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు మరియు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము.  అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించెను.






No comments:

Post a Comment